ఛాతి ఆస్పత్రిలో కరోనా కలకలం.. 33 మంది వైద్యులు, సిబ్బందికి కొవిడ్ - corona cases in hyderabad
18:57 January 22
ఛాతి ఆస్పత్రిలో కరోనా కలకలం.. 33 మంది వైద్యులు, సిబ్బందికి కొవిడ్
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మూడో దశలో మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టట్లేదు. ఈసారి పోలీసు, వైద్య శాఖలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే.. గాంధీ, ఎర్రగడ్డ మానసిక వైద్యశాలల్లో కరోనా ప్రతాపం చూపించగా... ఇప్పుడు తాజాగా ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కలవరం సృష్టిస్తోంది.
ఛాతి ఆస్పత్రిలో మొత్తం 33 మంది వైద్యులు, సిబ్బందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఇందులో 17 మంది పీజీ వైద్యులకు కరోనా సోకగా.. ఆరురుగు సీనియర్ రెసిడెంట్ వైద్యులకు, 8 మంది ఫ్యాకల్టీ, ఇద్దరు ఏఆర్‌టీ వైద్యులకు కొవిడ్ నిర్ధరణైనట్టు తేలింది.
ఇదీ చూడండి: