ఏపీలో కొత్తగా 31 మందికి కరోనా... 603కు చేరిన కేసులు - కొవిడ్ -19 తాజా వార్తలు
10:45 April 18
corona cases
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరింత పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కేసుల సంఖ్య 603కు చేరింది. కొత్తగా కృష్ణా జిల్లాలో 18, కర్నూలు జిల్లాలో 5 నమోదు కాగా... తూర్పు గోదావరి జిల్లాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైనట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వైరస్‌తో మరొకరు మృతి చెందగా... రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15 మంది మృతి చెందినట్లు పేర్కొంది. ప్రస్తుతం 546 మంది కొవిడ్ బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
అత్యధికంగా 126 కేసులతో కర్నూలు తొలి స్థానంలో నిలిచింది. గుంటూరు (122), నెల్లూరు (64), కృష్ణా (61) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాలేదు.