ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,00,103 పరీక్షలు నిర్వహించగా.. 3,040 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,17,253 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 14 మంది బాధితులు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 12,960కి చేరింది.
AP Corona Cases: ఏపీలో కొత్తగా 3,040 కరోనా కేసులు - ఏపీ న్యూస్
ఏపీలో తాజాగా మూడు వేల 40 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి 14 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో నాలుగు వేల 576 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 30,300 క్రీయాశీల కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు.
3040-new-more-corona-cases-reported-in-andhrapradesh
24 గంటల వ్యవధిలో 4,576 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,73,993కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 30,300 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,27,99,245 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.