రాష్ట్రంలో 30,035 కొవిడ్ పడకలు ఖాళీ - telangana corona cases
తెలంగాణలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. అప్రమత్తమైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బాధితుల కోసం సరిపడా కొవిడ్ పడకలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కలిపి 30వేల 35 కరోనా పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.
ఖాళీ కొవిడ్ పడకలు, తెలంగాణలో ఖాళీ కొవిడ్ పడకలు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి ఆదివారంనాటికి 30,035 కొవిడ్ పడకలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10,269, ప్రైవేటులో 19,766 పడకలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,473 సాధారణ పడకలు, 4,681 ఆక్సిజన్ పడకలు, 1,115 వెంటిలేటర్ పడకలు; ప్రైవేటులో 11,795 సాధారణ, 4,631 ఆక్సిజన్, 3,340 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్యశాఖ నివేదికలో వెల్లడించింది.
- ఇదీ చదవండి :రెమ్డెసివిర్ పేరిట నిలువుదోపిడీ.