సైదాబాద్ ఘటన నిందితున్ని పట్టిస్తే... రూ.10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. డబ్బులకు ఆశపడైనా... నిందితున్ని పట్టించేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారనే స్ట్రాటజీతో పోలీసులు వ్యవహరించి ఉండొచ్చు. ఇదే తరుణంలో ఓ జంతుప్రేమికురాలు కూడా ఓ రివార్డు ప్రకటించింది. తప్పిపోయిన శునాకాన్ని పట్టించేందుకు ఆసక్తి చూపించాలనో.. వెతికిచ్చినందుకు ప్రొత్సాహకం ఇవ్వాలనో.. తన కుక్కపై ఏకంగా రూ.30 వేల రివార్డు ప్రకటించింది. అసలు విషయమేంటంటే...
పన్నెండేళ్లుగా పెంచుకున్న ప్రేమ..
హైదరాబాద్ ఖైరతాబాద్ చింతల్ బస్తీ ప్రాంతానికి చెందిన పుష్పప్రియ జంతు పేమికురాలు. చిన్నతనం నుంచి ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుకుంటున్నారు. ఏడాది వయసున్న డాలీని తెచ్చుకుని 12 ఏళ్లుగా పెంచుకుంటున్నారు. సాధారణంగా రోజూ తనంతట తానే నేచర్కాల్కి వెళ్లి వచ్చే డాలీ.. ఫిబ్రవరి 7న మాత్రం ఎందుకో తిరిగి ఇంటికి రాలేదు. ఆ రోజు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి పుష్పప్రియ వెతుకుతూనే ఉంది. ఖైరతాబాద్ పరిసరప్రాంతాల్లో, న్యూస్పేపర్లలో కరపత్రాలు కూడా పంచింది. అయినా... ఇప్పటికీ ఆచూకీ లభించలేదు.
ఎలాగైనా పట్టుకోవాలని...