తెలంగాణ

telangana

ETV Bharat / city

విద్యుత్​​ వాహనదారులకు శుభవార్త... 30 ఛార్జింగ్​ స్టేషన్ల ఏర్పాటు

విద్యుత్ వాహనాలు వినియోగించే వాళ్లు ఇక రోడ్లపై రయ్ రయ్ మని దూసుకెళ్లొచ్చు. ఛార్జింగ్​ కోసం చింతించాల్సిన అవసరమే లేదు. గ్రేటర్ హైదరాబాద్​లో 30 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఈ స్టేషన్లను వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది.

30 charging stations in electric vehicles in hyderabad
30 charging stations in electric vehicles in hyderabad

By

Published : Jan 27, 2021, 10:50 AM IST

విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలంటే.. ముందుగా వాహనదారులు ఆలోచించేది ఛార్జింగ్ పాయింట్లు. వీలైనన్ని ఛార్జింగ్​ పాయింట్లు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. గ్రేటర్ హైదరాబాద్​లో 30 ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(రెడ్కో) ప్రకటించింది. ఇప్పటికే వీటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ఆ సంస్థ వైస్ ఛైర్మన్ జానయ్య తెలిపారు.

ఫేమ్-2 పథకం కింద ప్రజలు వినియోగించేందుకు వీలుగా 118 విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను హైదరాబాద్​లో, 10 కేంద్రాలను కరీంనగర్-వరంగల్​లలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన సర్వే కూడా కొనసాగుతోంది. 2021 జూన్ వరకు ఈ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు.

ఫేమ్-1 కింద పలు ప్రభుత్వ కార్యాలయాల్లో 30 విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు జానయ్య తెలిపారు. వీటిని ఫిబ్రవరి రెండో వారంలోపు పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. టీఎస్ ఆర్టీసీ ముషీరాబాద్ డిపోలో-2, టీఎస్ ఆర్టీసీ ఉప్పల్ డిపోలో-3, టీఎస్ఐఆర్సీ రాజేంద్రనగర్-1, ట్రాన్స్కో విద్యుత్ సౌధ-2, ట్రాన్స్కో శిక్షణ కేంద్రం-1, ఎన్ఎస్ఐసీ కుషాయిగూడ-2, బీఆర్కే భవన్-2, టీఎస్ రెడ్కో భవన్-1, ఈఎస్సీఐ-2, సీఐటీడీ బాలానగర్-2, సీఐపీఈటీ చెర్లపల్లి-2, ఎన్ఐ-ఎంఎస్ఎంఈ యూసఫ్ గూడ-2, టీయూఎఫ్ఐడీసీ-1, టీఎస్ ఎస్పీడీసీఎల్-2, హెచ్ఎండీఏ-4, టీఎస్ రెడ్కో భవనం-1 అందుబాటులోకి రానున్నాయి.

ఇదీ చూడండి:'నేను కాళికను.. నేనే శివుడిని'

ABOUT THE AUTHOR

...view details