తెలంగాణ

telangana

SZC meeting: తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం.. హాజరైన హోంమంత్రి

By

Published : Nov 14, 2021, 3:27 PM IST

Updated : Nov 14, 2021, 4:40 PM IST

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం తిరుపతిలో ప్రారంభమైంది(Southern Zonal Council Meeting news). రాత్రి 7 గంటల వరకు భేటీ కొనసాగనుంది. ఈ సమావేశానికి సంబంధించి అజెండాలో ప్రవేశపెట్టిన 26 అంశాలపై చర్చించనున్నారు.

దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం
దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం

ఏపీలో తిరుపతి వేదికగా దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది(Southern Zonal Council Meeting news). కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ.. రాత్రి 7 వరకు కొనసాగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. అజెండా సమావేశాలను అంతర్రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి ప్రవేశపెట్టగా.. అమిత్ షా ముగింపు ఉపన్యాసం చేయనున్నారు.

అజెండాలో మొత్తం 26 అంశాలు ఉండగా.. గత సమావేశ నిర్ణయాలకు సంబంధించిన 2 నివేదికలపై చర్చ జరగనుంది. తర్వాతి సమావేశ వేదిక ఖరారు సహా 24 కొత్త అంశాలపై ఈ భేటీలో(Southern Zonal Council Meeting news) చర్చించనున్నారు.

ఏ రాష్ట్రం నుంచి ఎవరంటే..

  • తమిళనాడు - పొన్నుమూడి, ఉన్నత విద్యాశాఖ మంత్రి
  • కేరళ - మంత్రి రాజన్, రెవెన్యూ శాఖ
  • తెలంగాణ - మహమూద్ అలీ,హోం మంత్రి
  • పుదుచ్చేరి - ముఖ్యమంత్రి రంగస్వామి
  • కర్ణాటక - ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై
  • ఏపీ - ముఖ్యమంత్రి జగన్
  • పుదుచ్చేరి ఇంఛార్జి గవర్నర్ - తమిళిసై
  • అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ - దేవ్ంద్ర కుమార్ జోషి
  • లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ - ప్రఫుల్ పటేల్

ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ దూరం

దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశానికి(Southern Zonal Council Meeting news) దక్షిణాది రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ మంత్రి మహమూద్ అలీ(home minister mahamod ali), రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (CS Somesh KUmar) పాల్గొన్నారు. పుదుచ్చేరి ఇంఛార్జి గవర్నర్​గా తమిళిసై సౌందరరాజన్(Tamilisai) ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా అజెండా అంశాలను అంతర్రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి ప్రవేశపెట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన చట్టంలోని వివిధ అంశాలపైనా చర్చకు ఈ సమావేశంలో విజ్ఞప్తి చేయనున్నారు.

నెల్లూరులో పర్యటించిన కేంద్రం హోమంత్రి అమిత్ షా

ఈ సమావేశానికి ముందు కేంద్ర హోమంత్రి అమిత్ షా నెల్లూరులో జరిగిన స్వర్ణభారత్‌ ట్రస్టు 20వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice president) చాలా కృషి చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(union home minister Amith shah) కొనియాడారు. కేంద్ర మంత్రి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక కీలక పదవులకు వన్నె తెచ్చారన్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టు 20వ వార్షికోత్సవానికి వెంకయ్యనాయుడితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు.

తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం

ఇదీ చదవండి:

AMIT SHAH : అనేక పదవులకు వెంకయ్యనాయుడు వన్నె తెచ్చారు: అమిత్‌షా

Last Updated : Nov 14, 2021, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details