ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 95,366 పరీక్షలు నిర్వహించగా.. 2,925 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,20,178 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 26 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఏపీ వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,986కి చేరింది. 24 గంటల వ్యవధిలో 3,937 మంది బాధితులు కోలుకోవడంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,77,930కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఏపీలో 29,262 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,28,94,611 నమూనాలను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.