తెలంగాణలో మరో 2892 కరోనా కేసులు, 10 మంది మృతి
09:38 September 02
08:26 September 02
రాష్ట్రంలో కొత్తగా 2892 కరోనా కేసులు,
రాష్ట్రంలో కొత్తగా 2,892 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల సంఖ్య 1,30,589కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 477 కరోనా కేసులు వెలుగుచూశాయి. కొత్తగా 10 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 846 మంది తుదిశ్వాస విడిచారు.
కొవిడ్ కోరల నుంచి మరో 2,240 మంది బాధితులు బయటపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 97,402 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,341 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 25,271 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
జిల్లాల వారీగా..
జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 477 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 234, మేడ్చల్ 192, నల్గొండ జిల్లాలో 174 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరీంనగర్ 152, ఖమ్మం 128, వరంగల్ అర్బన్ జిల్లాలో 116 మంది కొవిడ్ వైరస్ బారిన పడ్డారు. నిజామాబాద్ 110, సిద్దిపేట 108, సూర్యాపేట జిల్లాలో 108 మందికి కరోనా సోకింది.