రాష్ట్రంలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి - తెలంగాణలో కరోనా కేసులు
20:20 May 20
రాష్ట్రంలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో మరో 27 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 కేసులు నిర్ధారణ కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 12 మంది వలస కార్మికుల్లో కరోనా పాజిటివ్ గుర్తించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వలసజీవుల సంఖ్య 89కి చేరింది. తాజా కేసుల నమోదుతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితులు 1661కు పెరిగారు.
ప్రస్తుతం 608 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. బుధవారం ఇద్దరు డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకెళ్లినవారి సంఖ్య 1013కి పెరిగింది. కరోనా మహమ్మారి బారిన పడి తాజాగా రాష్ట్రంలో మరో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 40కి పెరిగింది.