ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా జనవరి ఒకటి నుంచి 31 వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 259 మంది చిన్నారులను రక్షించినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ తెలుసుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామన్నారు. మొత్తం 259 మందిలో రాష్ట్రానికి చెందిన 159 మంది బాలబాలికలు ఉన్నారు. వీరిలో 136 మంది బాలురు, 23 మంది బాలికలు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిలో 79 మంది బాలురు, 21 మంది బాలికలు ఉన్నట్లు వెల్లడించారు.
రాష్ట్రానికి చెందిన వారిలో.. ఇటుక బట్టీల్లో పనిచేసేవారు 14 మంది, హోటల్స్‌లో 9 మంది, బాల కార్మికులుగా 48 మంది, ఇతర సంస్థలు, ఫౌల్ట్రీ ఫాంలలో పనిచేస్తున్న 88 మంది చిన్నారులను సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు.