రాష్ట్రంలో కొత్తగా 2,574 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 1,40,969కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 325 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా కేసులు.. 17.3 లక్షల పరీక్షలు - తెలంగాణలో కరోనా కేసులు
09:08 September 06
రాష్ట్రంలో కొత్తగా 2,574 కరోనా కేసులు.. 17.3 లక్షల పరీక్షలు
కొవిడ్ కోరల్లో చిక్కుకొని మరో 9 మంది మరణించగా.. ఇప్పటి వరకు 886 మంది చనిపోయారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని మరో 2,927 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1,07,530 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు.
తెలంగాణలో ప్రస్తుతం 32,553 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 25,449 మంది బాధితులు ఉన్నారు. రాష్ట్రంలో శనివారం.. 62,736 మందికి కరోనా పరీక్షలు చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు 17.3 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.