సీబీఐ పేరుతో 25 తులాల బంగారం దోచేశారు
సీబీఐ అధికారులమంటూ నమ్మబలికి ఆరుగురు వ్యక్తులు ఓ జ్యోతిష్కుని వద్ద 25 తులాల బంగారం దోచుకెళ్లారు.
సీబీఐ పేరుతో 25 తులాల బంగారం దోచేశారు
హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని అన్నపూర్ణ బ్లాక్‌లోని ఉషా న్యూమరాలజీ సంకల్పసిద్ధి కార్యాలయంలో నకిలీ సీబీఐ అధికారులు దాడి చేశారు. సీబీఐ పేరుతో వచ్చి ఆరుగురు వ్యక్తులు ఆఫీసులో తనిఖీలు చేశారు. జ్యోతిష్కుడు డాక్టర్ జగదీశ్‌బాబును భయపెట్టి... అతని నుంచి 11 ల్యాప్‌టాప్‌లు, 12 సెల్ఫోన్లు, 25 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. జగదీశ్ ఫిర్యాదు మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి : 'సోషల్ మీడియా నియంత్రణకు ప్రత్యేక మార్గదర్శకాలు'
TAGGED:
fake cbi officers stole