తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏలూరులో వంద మందికి పైగా అస్వస్థత.. రంగంలోకి వైద్య బృందాలు - minister alla nani latest news

ఏపీలోని ఏలూరు వన్ టౌన్​లో వంద మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పలువురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న వైద్యులు వివరాలు సేకరిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆరాష్ట్ర మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు.

elluru
elluru

By

Published : Dec 5, 2020, 10:30 PM IST

Updated : Dec 5, 2020, 11:43 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్‌ పరిధిలో స్థానికులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పడమర వీధి, దక్షిణ వీధి ప్రాంతాల్లో కళ్లు తిరగడం, వాంతుల వంటి లక్షణాలతో వంద మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో అత్యధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. వన్​టౌన్ పరిధిలోనే కాకుండా రెండో పట్టణంలోనూ బాధితులను గుర్తించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్యులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఒక్కసారిగా పెద్దసంఖ్యలో అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ నేపథ్యంలో అస్వస్థతకు గురైన వారి రక్తనమూనాలు సేకరించి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం పంపించినట్లు వైద్యులు వెల్లడించారు.

ఏలూరులో వంద మందికి పైగా అస్వస్థత.. రంగంలోకి వైద్య బృందాలు

బాధితులకు మంత్రి నాని పరామర్శ..

పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఒకేసారి ఇంత మంది అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు తెలియరాలేదని.. వైద్య బృందం ఆ పనిమీదే ఉందని చెప్పారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఓ బాలికను మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించామన్నారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో వైద్యుల బృందం ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆళ్ల నాని వివరించారు.

ఏలూరులో వంద మందికి పైగా అస్వస్థత.. రంగంలోకి వైద్య బృందాలు

భయాందోళనలో స్థానికులు..

కారణం ఏంటో తెలియకుండా పెద్ద ఎత్తున ప్రజలు అస్వస్థతకు గురికావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నీటి కాలుష్యం కారణంగా అలా జరుగుతుందనే అనుమానంతో ముందస్తు చర్యలో భాగంగా ఇంట్లో నీరు తాగకూడదంటూ వైద్య సిబ్బంది, వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న శుద్ధ జలం (ఫ్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌) ప్లాంట్‌ వద్ద నీటి కోసం ప్రజలు బారులు తీరారు. అస్వస్థతకు గల కారణాలను సాధ్యమైనంత త్వరగా తెలుసుకోవాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి :ఆన్‌లైన్‌ ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్​ పేరుతో రూ.34 కోట్ల వసూలు

Last Updated : Dec 5, 2020, 11:43 PM IST

ABOUT THE AUTHOR

...view details