ఏపీలో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 2230కు చేరింది. కొత్తగా శ్రీకాకుళంలో 7, చిత్తూరు 4, గుంటూరు 4, కర్నూలు 3, ప్రకాశం 3, విశాఖపట్నం 3, నెల్లూరు జిల్లాలో ఒక్క కొవిడ్ కేసు నిర్ధారణ అయ్యాయి.
గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందగా... ఆస్పత్రి నుంచి 1433 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 747 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది.