తెలంగాణ

telangana

ETV Bharat / city

కార్పొరేటర్లలో 25 మందికి నేర చరిత్ర..

జీహెచ్‌ఎంసీకి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లలో 25 మందికి నేర చరిత్ర ఉంది. గ్రేటర్‌ వ్యాప్తంగా ఎన్నికల బరిలో నిలిచిన 1,122 మందిలో 49 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎఫ్‌జీజీ) గతంలో ప్రకటించింది.

25 ghmc corporators have criminal background
కార్పొరేటర్లలో 25 మందికి నేర చరిత్ర

By

Published : Dec 6, 2020, 8:50 AM IST

బల్దియా ఫలితాల్లో గెలిచిన కార్పొరేటర్లలో 25 మంది నేరచరిత్ర కలిగిన వారున్నారు. భాజపా నుంచి 10 మంది, తెరాస నుంచి 8 మంది, ఎంఐఎంకు చెందిన ఏడుగురు కార్పొరేటర్లు ఆ జాబితాలో ఉన్నారు. క్రితంసారి 30 మంది నేరచరితులు ఉన్నారని, ఈ సారి ఆ సంఖ్య తగ్గిందని ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి శనివారం పేర్కొన్నారు. వివరాలను విడుదల చేశారు.

ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ విడుదల చేసిన జాబితా

* భాజపా: కె.నర్సింహారెడ్డి(మన్సూరాబాద్‌), వి.మధుసూదన్‌రెడ్డి(చంపాపేట్‌), వి.రాధ(ఆర్‌కేపురం), వి.పవన్‌కుమార్‌(కొత్తపేట), జి.శంకర్‌యాదవ్‌(బేగంబజార్‌), లాల్‌సింగ్‌(గోషామహల్‌), టి.శ్రీనివాస్‌రెడ్డి(మైలార్‌దేవ్‌పల్లి), డి.కరుణాకర్‌(గుడిమల్కాపూర్‌), కె.రవికుమార్‌(రాంనగర్‌), వి.శ్రవణ్‌(మల్కాజిగిరి).

* తెరాస: బాబా ఫసియుద్దీన్‌(బోరబండ), ఆర్‌.నాగేందర్‌ యాదవ్‌(శేరిలింగంపల్లి), ఎం.కుమార్‌యాదవ్‌(పటాన్‌చెరు), ఎన్‌.శ్రీనివాస్‌రావు(హైదర్‌నగర్‌), విజయశేఖర్‌(రంగారెడ్డినగర్‌), ఆర్‌.జితేంద్రనాథ్‌(మచ్చబొల్లారం), వై.ప్రేమ్‌కుమార్‌(ఈస్ట్‌ ఆనంద్‌భాగ్‌), సునీతరెడ్డి(మెట్టుగూడ)

* ఎంఐఎం: ఎస్‌.మిన్హాజుద్దీన్‌(అక్బర్‌భాగ్‌), ఎండీ అలీషరీఫ్‌(లలితాభాగ్‌), అబ్దుల్‌వాహబ్‌(చాంద్రాయణగుట్ట), ఎండీ ముస్తఫాఅలీ(శాలిబండ), కె.ముబాషిరుద్దీన్‌(కిషన్‌భాగ్‌), ఎండీ జాకీర్‌బాకర్‌(దత్తాత్రేయనగర్‌), ఎం.స్వామి(కార్వాన్‌)

ABOUT THE AUTHOR

...view details