Corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,493 కరోనా కేసులు, 15 మరణాలు - covid-19 cases
![Corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,493 కరోనా కేసులు, 15 మరణాలు 2,493 new corona cases has reported in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11980926-1103-11980926-1622557302242.jpg)
19:28 June 01
Corona cases: కొత్తగా 2,493 కరోనా కేసులు, 15 మరణాలు
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 94,189 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 2,493 కరోనా కేసులు నమోదయ్యాయి. 15 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు. కరోనా నుంచి కోలుకున్న మరో 3,308 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 33,254 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 318 కరోనా కేసులు నమోదవగా... నల్గొండ జిల్లాలో 165, రంగారెడ్డి జిల్లాలో 152, కరీంనగర్ జిల్లాలో 129, ఖమ్మం జిల్లాలో 121 మంది మహమ్మారి బారిన పడ్డారు.