ఏపీలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 2 వేల 442 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 16 మంది మృతిచెందారు. కరోనా నుంచి 2 వేల 412 మంది బాధితులు కోలుకున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 20 వేల 184 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
Ap Corona Cases: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు - ఏపీ కరోన కేసులు
ఏపీలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రోజువారీ నమోదైన కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా 2,442 మందికి వైరస్ సోకగా.. మరో 16 మంది మృతి చెందారు.
ap corona cases
ఏపీవ్యాప్తంగా 85 వేల 822 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తూర్పుగోదావరిలో అత్యధికంగా 477, చిత్తూరు జిల్లాలో 433 మందికి కరోనా సోకింది.
ఇదీచూడండి:కొవిడ్ మరణాల లెక్కలపై కేంద్రం క్లారిటీ