ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 74,820 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 2,174 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు ఏపీలో 19లక్షల 52వేల 513 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులో కొవిడ్ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,241కి చేరింది.
AP Corona Cases: కొత్తగా 2,174 కరోనా కేసులు.. 18మరణాలు - ఏపీ కరోనా కేసులు తాజా వార్తలు
ఏపీలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,174 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కొవిడ్ బారిన పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 2 వేల 412 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
24 గంటల వ్యవధిలో 2,412 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,16,914కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 22,358 క్రియాశీల కేసులున్నాయి. కరోనా బారిన పడి కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు.
ఇదీ చదవండి:CM KCR Phone Call: హుజూరాబాద్‌పై కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. ఆడియో వైరల్