రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు - కొత్త కరోనా కేసుల నమోదు
09:18 December 28
రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 2,85,068కు చేరింది. వైరస్‌తో ఇప్పటివరకు 1,533 మంది మరణించారు.
కొత్తగా కోలుకున్న 551 మందితో కలిపి 2,77,304 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 6,231 యాక్టివ్ కేసులు ఉండగా... 4,136 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొవిడ్ కేసులు వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి:అక్కడ... నింగి.. నేల.. నీరు.. అన్నీ కలుషితమే