ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 20,345 కరోనా కేసులు, 108 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 14,502 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,95,102 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 86,878 కరోనా పరీక్షలు చేశారు.
ఏపీలో తాజాగా 20,345 కేసులు... 108 మంది మృతి - ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. తాజాగా 20,345 కేసులు నమోదు కాగా... మహమ్మారి బారిన పడి 108 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 18 మంది కరోనాతో చనిపోయారు.
corona cases
కరోనాతో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 18 మంది మృతి చెందారు. విశాఖ-12, గుంటూరు, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో 10 మంది చొప్పున వైరస్‌కు బలయ్యారు. ప్రకాశం-9, నెల్లూరు-8, కృష్ణా- 7, శ్రీకాకుళం-6, అనంతపురం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందగా.. కడప జిల్లాలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు.