రాష్ట్రంలో మరో 2,009 మందికి కరోనా, 10 మంది మృతి - covid 19 death stats telangana
09:00 October 02
రాష్ట్రంలో మరో 2,009 మందికి కరోనా, 10 మంది మృతి
రాష్ట్రంలో మరో 2,009 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 1,95,609 మందికి కరోనా సోకినట్టయింది. మరో 10 మరణాలు సంభవించగా... వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 1,145 మంది మృతిచెందారు. అయితే రోజురోజుకూ కోలుకుంటున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. తాజాగా మరో 2,437 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 1,65,844 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు.
జీహెచ్ఎంసీలో మరో 293 కరోనా కేసులు నమోదవగా.. మేడ్చల్ జిల్లాలో 173, రంగారెడ్డిలో 171 కేసులు వచ్చాయి. కరీంనగర్‌లో 114, నల్గొండలో 109, ఖమ్మంలో 104, భద్రాద్రి జిల్లాలో 77 మందికి వైరస్ సోకింది.