తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 20,034 కరోనా కేసులు, 82 మరణాలు - ap latest news

ఏపీ కరోనా వార్తలు
ఏపీ కరోనా వార్తలు

By

Published : May 4, 2021, 8:05 PM IST

Updated : May 4, 2021, 8:17 PM IST

19:56 May 04

ఏపీలో కొత్తగా 20,034 కరోనా కేసులు, 82 మరణాలు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో.. ఆ రాష్ట్ర వ్యాప్తంగా 20,034 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. వైరస్ సోకి 82 మంది మృతి చెందినట్టు చెప్పారు.

వైరస్‌ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం రూ.346 కోట్లు కేటాయించినట్టు వివరించారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న బెడ్లు 21,850 ఉన్నాయని తెలిపారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రిలో చేర్చుకోవాలి' 

Last Updated : May 4, 2021, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details