తెలంగాణ

telangana

ETV Bharat / city

Corona: కృష్ణపట్నంలో ఇద్దరికి కరోనా... 27 మందికి స్వల్ప లక్షణాలు - కృష్ణపట్నంలో కరోనా కేసులు వార్తలు

ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నంలో వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్‌ పరీక్షల్లో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

corona cases in krishnapatnam
కృష్ణపట్నంలో కరోనా

By

Published : May 31, 2021, 10:01 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం (krishnapatnam)లో ఆదివారం నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో 2 కరోనా(corona) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యవసరంగా ముగ్గురికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారిణి ప్రవల్లిక తెలిపారు. మరో 27 మందికి స్వల్ప లక్షణాలున్నట్లు గుర్తించి, ఆర్టీపీసీఆర్‌ నిమిత్తం నమూనాలు జిల్లా కేంద్రానికి పంపినట్లు వివరించారు. రెండు రోజులపాటు గ్రామంలో పరీక్షలు చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details