అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా... ఏపీ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగింపు ప్రశాంతంగా ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలిదశలో 3,249 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 525 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 2,724 పంచాయతీల్లో 7,506 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ముగిసిన పంచాయతీ తొలిదశ పోలింగ్.. ప్రారంభమైన కౌంటింగ్
ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తొలిదశ పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 12 జిల్లాల్లో 2,723 పంచాయతీలు, 20,157 వార్డులకు పోలింగ్ పూర్తి చేశారు. 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో పోలింగ్ జరిగింది.
ap panchayat elections
ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక... ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తిచేస్తామని... ఇవాళ పదవి ఎన్నిక పూర్తి కాకపోతే రేపు నిర్వహిస్తామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు.
ఇదీ చదవండి:తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తా: వైఎస్ షర్మిల