రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,111కు చేరాయి. ఇవాళ్టి కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 143 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 11, రంగారెడ్డి 8, మహబూబ్‌నగర్ జిల్లాలో 4, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో 3, నాగర్‌కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో 2 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇవాళ వైరస్ బారిన పడి మరో 8 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 156కు చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,817 మంది డిశ్చార్జయ్యారు. ఆస్పత్రిలో 2,138 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు - తెలంగాణలో కరోనా ఉద్ధృతి
రాష్ట్రంలో కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు
17:06 June 10
రాష్ట్రంలో కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Jun 10, 2020, 10:09 PM IST