ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 18 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 15వేల 275 శాంపిల్స్ పరీక్షించారు. 18 వేల 972 మందికి పాజిటివ్ నిర్ధరణ కాగా.. 71 మంది మరణించారు.
ఏపీలో కొత్తగా 18,972 కరోనా కేసులు, 71 మరణాలు - ap corona cases
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 18, 972 మందికి పాజిటివ్ నిర్ధరణ కాగా, ఒక్కరోజే 71 మంది మరణించారు. తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 9 మంది చొప్పున మహమ్మారికి బలయ్యారు.
ఏపీలో కరోనా కేసులు
రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 10 వేల 227 మంది కోలుకున్నారు. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 9 మంది చొప్పున కొవిడ్‌తో మృతి చెందారు. అనంతపురం, కర్నూలులో ఏడుగురు చొప్పున ప్రాణాలు కోల్పోగా.. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు.
ఇదీ చదవండి:'కొవిడ్ లక్షణాలుంటే వెంటనే టెస్టులు, స్కాన్‌లంటూ వెళ్లొద్దు'