తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు, 12 మరణాలు - telanagana corona update
08:18 October 08
తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు, 12 మరణాలు
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 1,896 కొవిడ్ కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం 2,06,644 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు కరోనాతో 1,201 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 2,067 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 1,79,075 మంది బాధితులు కొవిడ్‌ను జయించారు.
ప్రస్తుతం 26,368 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా... హోం ఐసొలేషన్‌లో 21,724 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 294 మంది తాజాగా వైరస్ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 211, మేడ్చల్ జిల్లాలో 154, నల్గొండ జిల్లాలో 126, సిద్దిపేట జిల్లాలో 100, కరీంనగర్ జిల్లాలో 97, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 82 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండిః'విద్యాసంస్థలు ఇప్పుడే తెరవలేం.. దసరా తర్వాతే నిర్ణయం'