తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో మరో 189 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 189 మందికి కరోనా వైరస్​ సోకింది. కొవిడ్​ బారిన పడి మరో ఇద్దరు మృతిచెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,910 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

corona
రాష్ట్రంలో మరో 189 కరోనా కేసులు

By

Published : Feb 26, 2021, 3:05 PM IST

రాష్ట్రంలో మరో 189 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 31 మందికి కొవిడ్​ సోకింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2,98,453కు చేరింది. కొవిడ్​ బారిన పడి మరో ఇద్దరు మరణించగా.. ఇప్పటి వరకు 1,632 మంది మృతిచెందారు.

కరోనా నుంచి కోలుకొని మరో 129 మంది బాధితులు ఇళ్లకు చేరారు. మొత్తం 2,94,911 మంది కొవిడ్ ​నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,910 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 818 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

గత కొన్ని రోజులుగా కేసుల్లో పెద్దగా మార్పులు లేని కారణంగా... వారానికి ఒకసారి మాత్రమే వివరాలు తెలపాలని రాష్ట్ర వైద్యోరోగ్య శాఖ నిర్ణయించినా.. హైకోర్టు ఆదేశాలతో రోజువారి కేసుల వివరాలు వెల్లడిస్తున్నారు.

కరోనా కేసులు, పరీక్షలు తదితర వివరాలతో ప్రతిరోజు బులెటిన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. వీలైనన్ని సీరం పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. రెండో దశ కరోనా పొంచి ఉందని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం అప్రమత్తం చేసింది.

ఇవీచూడండి:వీలైనంత త్వరగా సీరం సర్వే చేయించండి : హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details