తెలంగాణ

telangana

ETV Bharat / city

లాక్‌డౌన్‌తో గర్భిణీలకు వైద్యసంకటం.. 18.5 లక్షల మందిపై ప్రభావం - IPAS DEVELOPMENT FOUNDATION news

లాక్​డౌన్ వల్ల వైద్యం అందుబాటులో లేకపోవడంతో దేశ వ్యాప్తంగా 18.5 లక్షల మంది మహిళలు సకాలంలో గర్భస్రావ చికిత్సలు పొందలేకపోయినట్లు అంచనా. చాలాకాలం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కరోనా చికిత్సా కేంద్రాలుగా మారాయని ఐపాస్‌ అభివృద్ధి ఫౌండేషన్‌ వెల్లడించింది. గర్భస్రావం అవసరమైన వారిలో దాదాపు 59శాతం మంది మహిళలు సంబంధిత వైద్యం పొందలేకపోయారని పేర్కొంది.

abortion
abortion

By

Published : Jun 28, 2020, 8:08 AM IST

మహిళల ఆరోగ్యంపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపింది. వైద్యం అందుబాటులో లేకపోవడంతో దేశ వ్యాప్తంగా 18.5 లక్షల మంది మహిళలు సకాలంలో గర్భస్రావ చికిత్సలు పొందలేకపోయినట్లు అంచనా. "చాలాకాలం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కరోనా చికిత్సా కేంద్రాలుగా మారాయి. అక్కడ అత్యవసరంగా గర్భస్రావం చేసేందుకు అవకాశాలు లేవు. ప్రైవేటు ఆసుపత్రులు కూడా మూతపడటంతో మహిళలకు వేరే మార్గం లేకుండా పోయింది" అని ఐపాస్‌ అభివృద్ధి ఫౌండేషన్‌ వెల్లడించింది.

మహిళలకు సురక్షిత గర్భస్రావం, గర్భనిరోధక అవకాశాలపై పనిచేస్తున్న ఈ సంస్థ లాక్‌డౌన్‌-1 నుంచి 4 వరకు పరిస్థితులను అంచనా వేసింది. గర్భం దాల్చినట్లు వెల్లడైన వెంటనే వద్దనుకుంటే సకాలంలో వైద్యుల సమక్షంలో వైద్య, శస్త్రచికిత్సల ద్వారా రక్షిత విధానంలో తొలగించుకోవాలి. తొలి రెండు లాక్‌డౌన్‌ల సమయంలో గర్భస్రావం అవసరమైన వారిలో దాదాపు 59శాతం మంది మహిళలు సంబంధిత వైద్యం పొందలేకపోయారు. కొందరు మహిళలు అరక్షిత పద్ధతి వినియోగిస్తున్నారు.

ఇదీ చదవండి:కరోనా విలయ తాండవం.. రాష్ట్రంలో 13వేలు దాటిన కేసులు

ABOUT THE AUTHOR

...view details