తెలంగాణలో కొత్తగా 1,763 కరోనా కేసులు, 8 మరణాలు - తెలంగాణలో కరోనా కేసులు
08:02 August 19
తెలంగాణలో కొత్తగా 1,763 కరోనా కేసులు, 8 మరణాలు
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం కొత్తగా 1,763 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి బాధితుల సంఖ్య 95,700కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. మంగళవారం 8 మంది మృతి చెందగా.. ఈ సంఖ్య 719కి చేరింది. తాజాగా 1,789 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 73,991కి చేరిందని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 484 కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 169, రంగారెడ్డి జిల్లాలో 166, వరంగల్ అర్బన్ జిల్లాలో 88, నల్గొండ జిల్లాలో 65, కామారెడ్డి జిల్లాలో 63, జగిత్యాల జిల్లాలో 61, కరీంనగర్ జిల్లాలో 53, మంచిర్యాల జిల్లాలో 55 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి :భార్య ఆత్మహత్య.. భర్తనే హత్య చేశాడా?