CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా కేసులు - CORONA CASES
08:33 March 04
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా కేసులు
CORONA CASES: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 31,303 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,89,401కి చేరాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
తాజాగా కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం మృతుల సంఖ్య 4,109గా ఉంది. కరోనా బారి నుంచి కొత్తగా 385 మంది కోలుకున్నారు. కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 61 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇక తాజాగా రాష్ట్రంలో మరో 1,18,670 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: Covid Cases in India: దేశంలో 7వేల దిగువకు కరోనా కేసులు