పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పబ్జీ ఆటకు బానిసై ఓ బాలుడు మృతి చెందాడు. జాజులకుంట గ్రామానికి చెందిన పైడిమాల పవన్ కుమార్ (16) పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆటలకు బానిసయ్యాడు. ప్రతిరోజు ఈ ఆటలాడుతూ సెల్ ఫోన్కు హత్తుకు పోయేవాడు.
ఆటకు బానిసై నిద్రాహారాలు మానేశాడు.. చివరికి చనిపోయాడు - pubg addicted die in ap
ఆడుతూ, పాడుతూ హాయిగా గడపాల్సిన యువకులు సెల్ఫోన్ ప్రపంచంలో పడి ప్రాణాలనే వదులుతున్నారు. ఇలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం జాజులకుంట గ్రామంలో జరిగింది. 16 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు.సెల్ఫోన్లో పబ్జీగేమ్ ఆడుతూ నిద్రహారాలు మానేశాడు. చివరికి అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు.
pubg
గత వారం రోజులుగా ఏకధాటిగా నిద్రాహారాలు లేకుండా ఆటలాడాడు. ఈ క్రమంలో అతనికి వాంతులు-విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనుమానంతో అతనికి కరోనా పరీక్షలు చేయించగా నెగిటివ్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.