ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 67,590 పరీక్షలు నిర్వహించగా.. 1,539 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,07,730 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 12 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఏపీ వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,778కి చేరింది.
ap corona cases: కొత్తగా 1,539 కేసులు.. 12 మరణాలు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 67,590 పరీక్షలు నిర్వహించగా.. 1,539 కేసులు నిర్ధారణ అయ్యాయి. 12 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
![ap corona cases: కొత్తగా 1,539 కేసులు.. 12 మరణాలు ap corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12886986-729-12886986-1629996932544.jpg)
ap corona cases
24 గంటల వ్యవధిలో 1,140 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,79,504కి చేరినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,778 యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 2,63,37,946 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
ఇదీచదవండి.