ap corona cases today: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,650 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 14,440 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ సోకి తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా బారి నుంచి తాజాగా 3,969 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 83,610 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258, అనంతపురంలో 1534, గుంటూరు 1458, ప్రకాశం 1399, కర్నూలు 1238, చిత్తూరు 1198, తూర్పుగోదావరి 1012, నెల్లూరు, 1103, కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో పోరాడుతూ ఇప్పటివరకు 14,542 మంది మృతి చెందారు.
దేశంలో కరోనా కేసులు..
Corona cases in India: మరోవైపు భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. 3,33,533 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 525 మంది మరణించారు. 2,59,168 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.78 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.18 శాతం నమోదైనట్లు పేర్కొంది.
- మొత్తం కేసులు:3,92,37,264
- మొత్తం మరణాలు:4,89,409
- యాక్టివ్ కేసులు:21,87,205
- మొత్తం కోలుకున్నవారు:3,65,60,650
Vaccination in India