ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను తోట్లవల్లూరు పీఎస్ నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు.. కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా పట్టాభికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. పట్టాభికి 14 రోజుల రిమాండ్ (Remand for tdp leader pattabhi)విధించారు.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశం