ap corona cases: ఏపీలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 44,516 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు.
కరోనా బారి నుంచి 2,942 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 64,136 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,244, చిత్తూరు జిల్లాలో 1,585, అనంతపురంలో 1,235, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులు నమోదయ్యాయి.
దేశంలోనూ వైరస్ విజృంభణ..
Corona cases in India: మరోవైపు దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. వేగంగా కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు దేశంలో.. 3,47,254 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 703 మంది మరణించారు. 2,51,777 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Covid Active Cases: యాక్టివ్ కేసుల సంఖ్య 20 లక్షల 18 వేల 825గా ఉంది. ఇది మొత్తం కేసుల్లో 5.23 శాతం. గత 235 రోజుల్లో ఇదే అత్యధికం. రికవరీ రేటు 93.50 శాతానికి పెరిగింది.
- మొత్తం కేసులు:3,85,66,027
- మొత్తం మరణాలు:4,88,396
- యాక్టివ్ కేసులు:20,18,825
- మొత్తం కోలుకున్నవారు:3,60,58,806
Omicron Cases in India:
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే సుమారు 5 శాతం మేర పెరుగుదల నమోదైంది. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,692కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.