తీగ లాగితే డొంకే కదులుతోంది... రాష్ట్రంలో మందుల కొనుగోలు కుంభకోణంలో రోజుకో కొత్త వ్యవహారం బయటకొస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 10మందిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా వెంకటేశ్వర హెల్త్ కేర్ ఎండీ అరవింద్‌రెడ్డి, సిబ్బంది రామిరెడ్డి, లిఖిత్‌రెడ్డిని అరెస్టు చేశారు.
పద్మతో కుమ్మక్కైన అరవిందరెడ్డి...
ఐఎంఎస్ విభాగం సంయుక్త సంచాలకురాలు పద్మతో కుమ్మక్కైన అరవిందరెడ్డి... వైద్య శిబిరాల్లో రోగులకు ఇవ్వాల్సిన వైద్య కిట్లు, ఔషధాలను ఆమె సాయంతో పక్కదారి పట్టించినట్లు గుర్తించింది. బహిరంగ మార్కెట్‌లో విక్రయించగా వచ్చిన దానిలో తన కమిషన్ తీసుకుని, మిగతా మొత్తాన్ని పద్మకు ఇచ్చేవాడని తేల్చారు. గత కొన్నేళ్లుగా అరవింద్ ఇదే తంతు కొనసాగిస్తూ వచ్చాడని వెల్లడైంది.