తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో మరో 13 కరోనా పాజిటివ్ కేసులు - corona virus death toll in telangana

రాష్ట్రంలో మరో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. కొత్తగా నిర్ధరణ అయిన వాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 983కు చేరినట్లు వివరించారు. కరోనా బాధితుల్లో ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపారు. జీహెచ్​ఎంసీ, వికారాబాద్‌, గద్వాల, సూర్యాపేట నుంచే ఎక్కువ కేసులు ఉన్నాయని ఈటల పేర్కొన్నారు.

telangana coronavirus
telangana coronavirus

By

Published : Apr 24, 2020, 6:32 PM IST

Updated : Apr 25, 2020, 8:47 AM IST

కరోనా నియంత్రణలో పురోగతి కనిపిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నిన్న కొత్తగా 13 మందికి వైరస్ సోకిందని ప్రకటించారు. ఈ సంఖ్యతో మొత్తం వైరస్ బారిన పడిన వారి సంఖ్య 983కు చేరుకుంది. నిన్నటి వరకు కరోనా నుంచి కోలుకుని 262 మంది బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. ఇవాళ మరో 29 మంది డిశ్చార్జ్‌ అవుతారని చెప్పారు. ఆస్పత్రిలో 663 మంది చికిత్సపొందుతున్నారన్నారు. ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నారని వివరించారు.

ఈటల రాజేందర్

నాలుగు ప్రాంతాల నుంచి ఎక్కువగా కరోనా కేసులు వచ్చాయి. వికారాబాద్‌లో 14 కుటుంబాల నుంచి ఎక్కువగా కరోనా కేసులు వచ్చాయి. గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కరోనా సోకింది. సూర్యాపేటలో 25 కుటుంబాల్లో 83 మందికి కరోనా సోకింది. జీహెచ్ఎంసీలో 44 కుటుంబాల్లో 265 మందికి కరోనా సోకింది. గాంధీ ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా నామకరణం చేశారు. 10 లక్షల పీపీఈ కిట్లు, 10 లక్షల ఎన్‌95 మాస్కులకు ఆర్డర్‌ ఇచ్చాం.

-ఈటల రాజేందర్, వైద్యారోగ్య శాఖ మంత్రి

రాష్ట్రంలో మరో 13 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో మరో 13 కరోనా పాజిటివ్ కేసులు : ఈటల

ఇదీ చూడండి:'వేసవిలో భారత్​ కరోనాను జయించొచ్చు!'

Last Updated : Apr 25, 2020, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details