తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Corona Cases: ఏపీలో కొత్తగా 12,926 కరోనా కేసులు, 6 మరణాలు - corona death toll in ap

AP Corona Cases Today: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,926 కేసులు నమోదు కాగా.. ఆరుగురు మరణించారు.

AP Corona Cases
ఏపీలో కరోనా కేసులు

By

Published : Jan 22, 2022, 5:53 PM IST

AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,763 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 12,926 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు మృతి చెందారు. కరోనా బారి నుంచి 3,913 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 73,143 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,959, చిత్తూరు జిల్లాలో 1,566, అనంతపురంలో 1,379 గుంటూరులో 1,212 కేసులు నమోదయ్యాయి.

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు...

Corona cases in India: మరోవైపు భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు.. 3,37,704 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 488 మంది మరణించారు. 2,42,676 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.22 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.31శాతంగా నమోదైనట్లు పేర్కొంది.

  • మొత్తం కేసులు:3,89,03,731
  • మొత్తం మరణాలు:4,88,884
  • యాక్టివ్ కేసులు:21,13,365
  • మొత్తం కోలుకున్నవారు:3,63,01,482

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10,050కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 67,49,746 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,61,16,60,078కు చేరింది.

టెస్టుల ధరలు తగ్గింపు..

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కొవిడ్ టెస్ట్​ల ధరలను తగ్గించాయి. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్​లు ఎక్కువ ధరలు వసూలు చేయకుండా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా ఆర్​టీపీసీఆర్ టెస్ట్ రేటును రూ.100 తగ్గించింది ఝార్ఖండ్. రాష్ట్రంలో రూ.300కు ఆర్​టీ​పీసీఆర్​, రూ.50కి ర్యాపిడ్ యాంటీజెన్​ చేస్తారు. దిల్లీలో ప్రస్తుతం ఆర్​టీపీసీఆర్​ టెస్ట్​కు రూ.300, ర్యాపిడ్ యాంటిజెన్​కు రూ.100 మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీలో ఇంటికే వచ్చి శాంపుల్స్ తీసుకుంటే రూ.500 చెల్లించాలి. ఇంతకు ముందు దీని ధర రూ.700గా ఉండేది. ప్రైవేటు ల్యాబుల్లో టెస్ట్​ల రేటును ఆంధ్రప్రదేశ్​ కూడా తగ్గించింది. ఆర్​టీపీసీఆర్ ధర రూ.350గా నిర్ణయించింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 36,32,661 మందికి కరోనా సోకింది. 9,034 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 34,67,86,244కి చేరగా.. మరణాలు 56,03,045కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 7,79,036 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,777 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7.1 కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 4,00,851 కేసులు వెలుగుచూశాయి. మరో 233 మంది చనిపోయారు.
  • ఇటలీలో 1,79,106 కొత్త కేసులు బయటపడగా.. 373 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 1,68,820 మందికి వైరస్​ సోకగా.. 396 మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో తాజాగా 1,18,171 కరోనా కేసులు బయటపడగా.. 160 మంది బలయ్యారు.
  • జర్మనీలో 1,38,634 వేల మందికి వైరస్ సోకింది. మరో 175 మంది మృతి చెందారు.
  • బ్రిటన్​లో మరో 95,787 వేల మంది వైరస్ బారిన పడ్డారు.​ 288 మంది మృతి చెందారు.

ఇదీ చదవండి:Fever Survey in Telangana: ఫీవర్ సర్వే ఎలా సాగుతోంది ?.. పరిశీలించిన మంత్రులు

ABOUT THE AUTHOR

...view details