గోదావరి అంటేనే.. మర్యాదలకు పెట్టింది పేరు. అందులోనూ భీమవరం గురించైతే.. ఇక చెప్పేదేముంది. అతిథులు ఇంటికి వచ్చారంటే... షడ్రుచుల సమ్మేళనంగా, ఎన్నటికీ మరిచిపోలేని విధంగా... విందు భోజనం వడ్డిస్తారు. వచ్చిన అతిథి అల్లుడైతే... అదీ సంక్రాంతి పండుగకైతే.. మర్యాదలు మామూలుగా ఉండవు. అస్సలు తగ్గరు. భీమవరం అండీ బాబూ... భీమవరం అంతే.. అనాల్సిందే.
భీమవరం మర్యాదలా మజాకా.. అల్లుడికి 125 వెరైటీ వంటకాలు - భీమవరంలో అల్లుడికి 125 రకాల వెరైటీలు న్యూస్
ఇంటికి అల్లుడొస్తే.. ఐదారు రకాల వంటలు చేసి.. విందు ఇస్తారు.. దానికే అంతా.. వామ్మో వాళ్ల అల్లుడు చాలా అదృష్టవంతుడండి అంటారు. కానీ ఓ అత్త అల్లుడి కోసం 125 రకాలు చేసి పెట్టింది. మరి ఏపీలో భీమవరం మర్యాద అంటే మామూలుగా ఉండదు కదా!
భీమవరం మర్యాదలా మజాకా
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కురిసేటి కాశీవిశ్వనాథం దంపతులు... కలకాలం గుర్తుండిపోయేలా 125 రకాల వంటకాలను అల్లుడికి రుచి చూపించారు. పెద్ద బల్లపై అరిటాకు పరిచి, దానిపై వెండిపళ్లెంలో ఆహార పదార్థాలను కొసరి కొసరి వడ్డించారు. అత్తారింటి మర్యాదలు చూసి పొంగిపోయిన అల్లుడు నారాయణ అఖిల్... భీమవరం మర్యాదలే మర్యాదలంటూ ఆనందం వ్యక్తం చేశాడు. భీమవరం వారి మర్యాదలు ఆనోటా ఈనోటా అందరికీ తెలిసి... అమ్మో 125 వంటకాలా అని చర్చించుకుంటున్నారు.
- ఇదీ చదండి :పండగ పూట పసందైన రుచి 'గోంగూర మటన్'