AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,217 కరోనా కేసులు - corona cases recent news
![AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,217 కరోనా కేసులు AP Corona Cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12838249-803-12838249-1629544295832.jpg)
16:23 August 21
AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,217 కరోనా కేసులు
ఏపీలో మరో 1,217మంది కరోనా బారినపడగా.. వైరస్‌తో 13 మంది చనిపోయారు. ఒక్కరోజు వ్యవధిలో 61,678 మందిని పరీక్షించగా అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 198, తూర్పుగోదావరి జిల్లాలో 182, చిత్తూరు జిల్లాలో 171 మందికి పాజిటివ్‌గా నిర్ధరించారు. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 15, అనంతపురం జిల్లాలో 17 మందికి వైరస్ సోకింది.
కరోనా వల్ల కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో 15వందల 35 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 15,141 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:Kishan Reddy: దేశానికి రాజైనా అంబర్‌పేటకు బిడ్డనే: కిషన్ రెడ్డి