తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం - ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

corona
corona

By

Published : Jun 2, 2020, 12:43 PM IST

Updated : Jun 2, 2020, 7:52 PM IST

12:40 June 02

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

వైద్యం చేసే వైద్య విద్యార్థులకే కరోనా సోకింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మందికిపైగా విద్యార్థులకు కరోనా పాజిటివ్​ వచ్చింది. ఉస్మానియా వైద్య కళాశాలలో 12 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు ప్రిన్సిపల్ శశికళ రెడ్డి తెలిపారు. ఓ పీజీ విద్యార్థికి పాజిటివ్ రావడం వల్ల పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు.  

ఉస్మానియా వసతిగృహంలో ఉన్న మొత్తం 296 మందికి పరీక్షలు చేయించామని చెప్పారు. ఇందులో 180 మంది యువతులు, 116 యువకులు ఉన్నారని తెలిపారు. రేపు ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పీజీ వైద్య విద్యార్థులు ఆస్పత్రికి వచ్చిన రోగులకు చికిత్స చేశారని వెల్లడించారు.

ఇదీ చూడండి :జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు

Last Updated : Jun 2, 2020, 7:52 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details