తెలంగాణ

telangana

ETV Bharat / city

మృతులపై అధికారులది ఒక లెక్క... ప్రత్యక్ష సాక్షులది మరో లెక్క! - రుయా ఆస్పత్రిలో 11 మంది కరోనా రోగులు మృతి

జరిగింది ఊహకందని విషాదం. అందులోనూ... అనుమానాలు. మృతులపై అధికారులది ఒక లెక్క. ప్రత్యక్ష సాక్షులది మరో లెక్క. ఆక్సిజన్‌ ఆగింది ఐదు నిమిషాలే అని అధికారులు చెప్తుంటే.. అర్ధగంటకుపైగా చేసిన ఆర్తనాదాలు వినిపించలేదా అని బాధిత బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ రుయా ఆస్పత్రిలో ఏం జరిగింది? ఆక్సిజన్‌ లేక ఎంత మంది ఊపిరి ఆగింది? కోర్టు మెట్లెక్కుతామంటున్నారు మృతుల బంధువులు.. ఇంకా ఏమని అంటున్నారు?

ruya deaths family members on facts
ruya deaths family members on facts

By

Published : May 11, 2021, 10:27 PM IST

ఏపీలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో ప్రాణవాయువు అందుబాటులో లేక 11 మంది చనిపోయారని చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణన్.. అధికారికంగా ప్రకటించారు. కానీ కళ్లెదుటే విలవిల్లాడుతూ ఊపిరి ఆగిన మృతుల బంధువులు.. ఈ సంఖ్యను ఏమాత్రం అంగీకరించడం లేదు. జరిగిన ఘోరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది వారి అనుమానం. రేపో మాపో డిశ్చార్జై.. ఇంటికి వస్తారనుకున్నవాళ్లను ఇలా రుయా సిబ్బంది నిర్లక్ష్యంతో మార్చురీలో చూస్తామనుకోలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వ లెక్కలు, రుయా సిబ్బంది నిర్లక్ష్యంపై మానవ హక్కుల సంఘంతోపాటు న్యాయస్థానంలో పిల్ వేస్తామని తెలిపారు.

మరణాలే కాదు.. ఆక్సిజన్ ఎంతసేపు ఆగిపోయిందనేదీ ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. ఐదు నిమిషాలే ఆక్సిజన్‌ సరఫరా ఆగిందని అధికారులు అంటుంటే.. అరగంటకుపైనే ఐసీయూలో ఆర్తనాదాలు చూశామని.. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రాణవాయువు కోసం తమ వాళ్లు మంచం మీదే విలవిల్లాడుతూ చనిపోయారని చెప్పారు. ఈ కడుపుకోతను తీర్చేదెవరని నిలదీస్తున్నారు. చనిపోయిన 11 మంది తప్ప మిగతావారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని అధికారులు చెప్తున్నా ఐసీయూలో ఆర్తనాదాలు ప్రత్యక్షంగా చూసినవారు.... భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం.. అసలు రుయాలో ఏం జరిగిందనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

మృతులపై అధికారులది ఒక లెక్క... ప్రత్యక్ష సాక్షులది మరో లెక్క!

ఇదీ చూడండి: రాష్ట్రంలో లాక్​డౌన్ 2.0... తాజా నిబంధనలు​ ఇవే..!

ABOUT THE AUTHOR

...view details