తెలంగాణలో కొత్తగా 1,196 కరోనా కేసులు - తెలంగాణ కొవిడ్ కేసులు
08:21 November 11
తెలంగాణలో కొత్తగా 1,196 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,196 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 2,53,651 చేరింది. కరోనా బారిన పడి మరో ఐదుగురు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,390 మంది మృతిచెందారు.
కరోనా నుంచి మరో 1,745 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 2,34,234కి చేరింది. ప్రస్తుతం 18,027 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 15,205 మంది బాధితులు ఉన్నారు. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 192, రంగారెడ్డి జిల్లాలో 121, మేడ్చల్ జిల్లాలో 101 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీచూడండి:కొవిడ్ బాధితుల్లో న్యూరాలజీ సమస్యలు