ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1,179 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. 42,737 నిర్ధారణ పరీక్షలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 192, చిత్తూరులో 190, పశ్చిమగోదావరిలో 161, అనంతపురంలో 8, కడపలో 30, గుంటూరులో 107, కృష్ణాలో 167, నెల్లూరులో 131, ప్రకాశంలో 124, శ్రీకాకుళంలో 19, విశాఖ 47, విజయనగరం జిల్లాలో ఒకరికి కరోనా సోకింది.
AP CORONA CASES: ఏపీలో 1,179 కరోనా కేసులు - రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గణాంకాలు
ఏపీలో కొత్తగా 1,179 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో కొత్తగా 11 మంది మృతి చెందారు. ప్రస్తుతం 13,905 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు ఆ రాష్టర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా కేసులు
ఏపీలో ప్రస్తుతం 13,905 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో11 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 14,089 కు పెరిగింది. 24 గంటల్లో 1,651 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.