ఏపీలోని కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 50,972 పరీక్షలు నిర్వహించగా.. 11,698 కేసులు, 37 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 10,20,926 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
కొవిడ్‌తో తూర్పు గోదావరి, నెల్లూరులో ఆరుగురు చొప్పున.. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నలుగురు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక్కరు చనిపోయారు. ఫలితంగా ఏపీ వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,616కి చేరింది.