తెలంగాణ

telangana

ETV Bharat / city

ARREST: పట్టాభి నివాసంపై దాడి కేసులో 11 మంది అరెస్టు - తెలంగాణ వార్తలు

తెదేపా నేత పట్టాభిరామ్ నివాసంపై దాడి ఘటనలో 11 మందిని అరెస్టు చేసినట్లు ఏపీ పోలీసులు తెలిపారు. దాడి ఘటనపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 148, 427, 452, 506, 149 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈనెల 19వ తేదీ సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులు, ఫర్నిచర్‌, వాహనాలను ధ్వంసం చేసినట్లు పటమట పోలీసులకు పట్టాభి భార్య చందన ఫిర్యాదు చేశారు.

pattabhi house attack, tdp leader pattabhi
పట్టాభి నివాసంపై దాడి కేసులో 11 మంది అరెస్టు, పట్టాభి ఇంటిపై దాడి

By

Published : Oct 23, 2021, 4:14 PM IST

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ నివాసంపై జరిగిన దాడి ఘటనలో 11 మందిని అరెస్టు చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో విజయవాడ గుణదల, క్రీస్తురాజపురం, బావాజీపేట, ఉడ్‌పేట, సీతారామపురం వాసులున్నారు. ఈనెల 19వ తేదీ సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులు, ఫర్నిచర్‌, వాహనాలను ధ్వంసం చేసినట్లు పటమట పోలీసులకు పట్టాభి భార్య చందన ఫిర్యాదు చేశారు. దాడి ఘటనపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 148, 427, 452, 506, 149 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అరెస్టయిన వారు..

దర్యాప్తులో భాగంగా పటమట పోలీసులకు అందిన సమాచారం ప్రకారం 11 మంది నిందితులను అరెస్టు చేసి వారికి నోటీసులు ఇచ్చామన్నారు. నిందితుల్లో బావాజీపేటకు చెందిన బచ్చు మాధవికృష్ణ, ఉడ్‌పేటకు చెందిన ఇందుపల్లి సుభాషిణి, గుణదలకు చెందిన తుంగం ఝాన్సీరాణి, బేతాల సునీత, క్రీస్తురాజపురానికి చెందిన యల్లాటి కార్తీక్‌, గొల్ల ప్రభుకుమార్‌, వినుకొండ అవినాష్‌, వంకాయలపాటి రాజ్‌కుమార్‌, బచ్చలకూరి అశోక్‌కుమార్‌, సీతారామపురానికి చెందిన గూడవల్లి భారతి, దండు నాగమణి ఉన్నట్లు తెలిపారు. విచారణలో భాగంగా ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలు, నేరం జరిగిన ప్రదేశానికి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఇప్పటివరకు 11 మంది నిందితులను గుర్తించామని పేర్కొన్నారు.

ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్(cm jagan)పై పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా.. విజయవాడ(vijayawada)లోని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి(tdp official spokesperson Pattabhi) ఇంటిపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఆయన ఇంట్లోని సామగ్రిని, ఇంటి ప్రాంగణంలో ఉన్న కారు, ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తమ ఇంటిపై దాడి చేశారని పట్టాభి కుటుంబసభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశం(pattabhi press meet)లో ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు(nakka anand babu)కు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన వాడిన భాషను వ్యతిరేకిస్తూ కొందరు వ్యక్తులు పలు ప్రాంతాల్లో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే హిందూపురం, విశాఖపట్నంలో వైకాపా కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడలో ఉన్న పట్టాభి నివాసంలోనూ కొందరు వైకాపా శ్రేణులు దాడి చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మందిని అరెస్టు చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:Bathukamma on burj Khalifa: విశ్వవేదికపై బతుకమ్మ సంబురం.. దుబాయ్‌ చేరుకున్న కవిత

ABOUT THE AUTHOR

...view details