గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ఆకలి తీర్చేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో 102 అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 14 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్లో 102 కొత్త అన్నపూర్ణ క్యాంటీన్లు - annapurna canteens in greater Hyderabad
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నూతనంగా 102 అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. ఈనెల 14 నుంచి నగర ప్రజలు ఈ సేవలు వినియోగించుకోవచ్చని చెప్పారు.

జీహెచ్ఎంసీ, జీహెచ్ఎంసీలో అన్నపూర్ణ క్యాంటీన్లు, అన్నపూర్ణ క్యాంటీన్లు
ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 140 అన్నపూర్ణ రూ.5ల భోజన క్యాంటీన్లు ఉన్నాయని.. కొత్త వాటితో కలిపి వీటి సంఖ్య 242కి చేరిందని వెల్లడించారు. ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ రూ.5లకే భోజనం లభిస్తుందని చెప్పారు. కూలీలు, ఇతర పనులపై నగరానికి వచ్చే ఎంతో మందికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.