తెలంగాణ

telangana

ETV Bharat / city

డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్‌ వినియోగిస్తే 10 వేలు ఫైన్​ - మోటరు వాహనాల చట్టం తాజా వార్తలు

మోటారు వాహనల చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘనలకు విధించే జరిమానాలను భారీగా పెంచుతూ ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మోటారు సైకిళ్లు, తేలికపాటి నాలుగు చక్రాల వాహనాలు ఒక కేటగిరీగా, భారీ వాహనాలు మరో కేటగిరీగా వర్గీకరిస్తూ జరిమానాలను పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. ద్విచక్రవాహన దారులు హెల్మెట్ ధరించకపోయినా.. నాలుగు చక్రాల వాహనాలు డ్రైవింగ్ చేసే వ్యక్తులు సీటు బెల్టు పెట్టుకోకపోయినా 1,000 రూపాయల జరిమానాను విధిస్తూ రవాణాశాఖ ఆదేశాలు ఇచ్చింది. వాహన తనిఖీల విధులకు ఆటంకం కలిగించినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా జరిమానాను విధిస్తూ నోటిఫికేషన్ వెలువడింది.

1000-rupees-penalty-to-who-dont-wear-helmet
డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్‌ వినియోగిస్తే 10 వేలు ఫైన్​

By

Published : Oct 22, 2020, 10:48 AM IST

డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్‌ వినియోగిస్తే 10 వేలు ఫైన్​

వాహనచోదకులు నిబంధనలు పాటించకపోతే ఇకపై భారీగా జరిమానాలు కట్టడానికి సిద్ధమవ్వాల్సిందే. మోటారు వాహన చట్టంలోని 37 సెక్షన్ల కింద ఉల్లంఘనలకు అపరాధ రుసుములు భారీగా పెంచుతూ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇవి బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మోటారు వాహన సవరణ చట్టం-2019 కింద ఈ జరిమానాలు పెంచుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

శిరస్త్రాణం (హెల్మెట్‌) లేకుండా ద్విచక్రవాహనాన్ని నడిపితే ఇప్పటి వరకు రూ.100 అపరాధ రుసుము విధిస్తుండగా ఇకపై రూ.వెయ్యి కట్టాలి. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వారికి శిరస్త్రాణం లేకపోయినా రూ.వెయ్యి అపరాధరుసుము విధించనున్నారు. డ్రైవింగ్‌ అర్హత వయసులేని వారు (18 ఏళ్లలోపు వారు) వాహనాలు నడిపితే రూ.5 వేలు జరిమానా కట్టాలి. ఇది గతంలో రూ.500 ఉండేది. అర్హత లేనివారికి వాహనం ఇస్తే వాహన యజమానికి గతంలో రూ.వెయ్యి జరిమానా విధించేవారు.

* డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్‌ వినియోగిస్తే తొలిసారి రూ.1,500, రెండోసారి రూ. 10,000
* మైనర్లు వాహనం నడిపితే: రూ. 5,000
* వాహనం డిజైన్‌ మారిస్తే: రూ. 1,00,000

ఇప్పుడు దాన్ని రూ.5 వేలకు పెంచారు. డ్రైవింగ్‌ చేసే సమయంలో సెల్‌ఫోన్‌ వినియోగిస్తే తొలిసారి రూ.1,500, మూడేళ్లలోపు రెండోసారి అదే తప్పుచేసి పట్టుబడితే రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రహదారులపై రవాణాశాఖ అధికారులు, పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలు తనిఖీ చేసినపుడు విధించే ఈ అపరాధ రుసుములు (కాంపౌండింగ్‌) గతం కంటే పెద్దఎత్తున పెంచారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్షలో అనర్హులై, వాహనాన్ని నడిపితే గతంలో రూ.500 అపరాధరుసుము విధించేవారు. ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచారు.
* తయారీదారు, డీలర్‌ సంబంధిత వాహనం డిజైన్‌లో మార్పులు చేసినా, కేంద్ర నిబంధనలు ఉల్లంఘించినా రూ.లక్ష అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
* పరిమితికి మించి లోడుతో వెళ్లే వాహనాలకు గతంలో రూ.2 వేలతోపాటు, టన్నుకు రూ.వెయ్యి చొప్పున అపరాధ రుసుము ఉండేది. దీన్ని ఇప్పుడు ఏకంగా రూ.20 వేలకు పెంచి, టన్నుకు రూ.2 వేల చొప్పున అదనం చేశారు.

ఇదీ చదవండి:నాయిని మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details